Ind vs Wi 2nd Test: పరుగులు చేయకుండా భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన విండీస్ బ్యాటర్లు
ట్రినిడాడ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్, ఇండియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగుకు దిగిన విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. పరుగులు చేయకుండా, ఔట్ కాకుండా వెస్టిండీస్ బ్యాటర్లు ఆడుతూనే ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో రోజు 67ఓవర్లు ఆడిన వెస్టిండీస్ కేవలం 143పరుగులు మాత్రమే చేసింది. వర్షం కారణంగా ఆటను అరగంట ముందుగానే ముగించారు. నాలుగో రోజు అరగంట ముందుగానే ఆటను ప్రారంభించనున్నారు.
209పరుగులు వెనుకే ఉన్న వెస్టిండీస్
వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాత్ వైట్ 235బంతులు ఆడి 75పరుగులు చేసాడు. అజాంతే 111బంతులు ఆడి 37పరుగులు చేసి ఇంకా క్రీజులో ఉన్నాడు. చంద్రపాల్ 95బంతుల్లో 33పరుగులు, బ్లాక్ వుడ్ 90బంతుల్లో 22పరుగులు చేసారు. భారత బౌలర్లలో జడేజా 2వికెట్లు, అశ్విన్, ముఖేష్ కుమార్, సిరాజ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్సులో టీమిండియా 438పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. అంటే వెస్టిండీస్ ఇంకా 209పరుగులు వెనుకే ఉంది. మరి నాలుగో రోజు ఆట ఎలా ఉండనుందో చూడాలి. రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో ఇండియా ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.