IND W Vs AUS W: రెండో టీ20లో భారత్‌పై ఆసీస్19 పరుగుల తేడాతో గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆడుతున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు పరాజయం తప్పలేదు. మూడు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత జట్టు 9వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు,స్మృతి మందాన 31 పరుగులు,షెఫాలీ వర్మ 29 పరుగులు,రిచా ఘోష్ 19 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లే గార్డెనర్ 3 వికెట్లు,కిమ్ గార్త్ 2 వికెట్లు,అన్నాబెల్ సదర్లాండ్ 2 వికెట్లు,సోఫీ 2 వికెట్లు సాధించారు.
వివరాలు
వోల్ హాఫ్ సెంచరీ..
మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్ ఫిబ్రవరి 21న అడిలైడ్‌లో జరగనుంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన జార్జియా వోల్ 88 పరుగులతో అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించింది. ఆమె ప్రదర్శనతో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బెత్ మూనీ 46 పరుగులతో రాణించింది.అయితే పెర్రీ 7 పరుగులు,ఫోయబ్ లిట్చ్‌ఫీల్డ్ 6 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. ఆష్లే గార్డెనర్ 10 పరుగులు చేసింది.భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 2 వికెట్లు, రేణుకా సింగ్ ఠాకూర్ ఒక వికెట్ సాధించారు.