India 720/9 : న్యూజిలాండ్ టెస్టులో భారత్ భారీ స్కోర్...350 ఆధిక్యం
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా బ్యాటింగ్ విధ్వంసం కొనసాగించింది. ఓవర్‌నైట్ స్కోరు 486/4తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. 166 ఓవర్లలో 9 వికెట్లకు 720 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఏకంగా 352 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్‌పై టెస్టుల్లో భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. 2019లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ చేసిన 715/9 స్కోరును భారత్ అధిగమించింది.
Details
టాప్ ఆర్డర్ నుంచి వచ్చిన పరుగుల వరద
భారత్ భారీ స్కోరుకు ఒక్క బ్యాటర్ మాత్రమే కారణం కాదు. యశస్వి జైస్వాల్ 89 బంతుల్లో 85 పరుగులు చేయగా, దేవ్‌దత్ పడిక్కల్ 175 బంతుల్లో 80 పరుగులు చేశాడు.
కెఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్ చూపిస్తూ 290 బంతుల్లో 136 పరుగులు సాధించాడు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 146 బంతుల్లో 98 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
దీంతో భారత ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 50కిపైగా పరుగులు చేయడం విశేషంగా నిలిచింది.
Details
పంత్ సెంచరీతో కొత్త రికార్డు
గిల్ ఔటైన సమయంలో నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన అన్షుల్ కాంబోజ్ కూడా తన వంతు సహకారం అందించాడు.
42 బంతుల్లో 38 పరుగులు చేసి రిషబ్ పంత్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఆ తర్వాత పంత్ తనదైన దూకుడుతో 153 బంతుల్లో 128 పరుగులు చేశాడు.
ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇది పంత్ టెస్టు కెరీర్‌లో 9వ సెంచరీ. అలాగే SENA దేశాల్లో టెస్టు సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.
Details
తొలి ఏడు వికెట్లకు 50+ భాగస్వామ్యాలు
పంత్ తర్వాత ధ్రువ్ జురెల్ 78 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 24, ఆకాశ్ దీప్ 13, జస్ప్రిత్ బుమ్రా 7 పరుగులు చేశారు.
జురెల్ ఔటైన వెంటనే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక్కడే మరో అరుదైన రికార్డు నమోదైంది.
భారత ఇన్నింగ్స్‌లో తొలి ఏడు వికెట్లకు 50కిపైగా పరుగుల భాగస్వామ్యాలు వచ్చాయి.
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి ఏడు వికెట్లకు ఇలా 50+ భాగస్వామ్యాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
2007లో ఓవల్‌లో భారత్ ఎనిమిది వికెట్లకు 50+ భాగస్వామ్యాలు సాధించిన రికార్డు కూడా ఉంది.
Details
టెస్టుల్లో భారత్‌కు మూడో అత్యధిక స్కోరు
720 పరుగులతో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. టెస్టుల్లో 700కిపైగా పరుగులు చేయడం భారత జట్టుకు ఇది ఐదోసారి.
ఈ జాబితాలో శ్రీలంక ఏడు సార్లతో ముందుంది. భారత్ గతంలో 2016లో ఇంగ్లాండ్‌పై 759/7, 2009లో శ్రీలంకపై 726/9 పరుగులు చేసింది.
ఇప్పుడు 720 పరుగులతో ఆ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు, రచిన్ రవీంద్ర రెండు వికెట్లు తీశారు.