
ICC World Cup 2023: భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. చూసేందుకు రానున్న ఫుట్ బాల్ దిగ్గజం
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తియ్యాయి.
వాంఖేడే స్టేడియం వేదికగా రేపు భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచు చూసేందుకు క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ మ్యాచును విక్షీంచేందుకు ఓ స్పెషల్ గెస్ట్ వస్తున్నట్లు తెలిసింది.
అతడు మరెవరో కాదు ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్.
యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ ఉన్న అతను మూడ్రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు రానున్నాడు.
ఈ క్రమంలో సెమీఫైనల్ మ్యాచుకు అతడు హాజరు అవుతాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
Details
సెమీ ఫైనల్ మ్యాచును చేసేందుకు సినీ, రాజకీయ ప్రముఖుల ఆసక్తి
సాధారణంగా ఫుట్ బాల్ మ్యాచులకు భారత క్రికెటర్లు వెళ్లడం చూసాం. కానీ తొలిసారి ఫుట్ బాల్ దిగ్గజం బెక్ హమ్ క్రికెట్ మ్యాచును చూసేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం.
ఇంగ్లండ్ గొప్ప క్రికెటర్లలో ఒకరైన బెక్‌హమ్ ప్రస్తుతం ఇంటర్ మియామి క్లబ్‌కు సహ యజమానిగా ఉన్నాడు.
మరోవైపు ఈ ప్రతిష్టాత్మక మ్యాచుకు పలువురు సినీ, రాజకీయ, మాజీ క్రికెటర్లు కూడా హాజరు కానున్నారు.