Page Loader
T20 World Cup Semi final లో తలపడనున్న భారత్- ఆస్ట్రేలియా
గ్రూప్-బిలో భారత మహిళలు రెండో స్థానంలో నిలిచారు

T20 World Cup Semi final లో తలపడనున్న భారత్- ఆస్ట్రేలియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 వరల్డ్ కప్ సెమీ‌ఫైనల్ జట్లు ఏవో తెలిసిపోయాయి. గురువారం కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో భారత్ జట్టు తలపడనుంది. శుక్రవారం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్ 2లో ఢీకొట్టనున్నాయి. ఈ సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య ఆదివారం ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6: 30 గంటలకి ప్రారంభంకానుంది ఇప్పటివరకు లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా జట్టు ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్ టీ20 వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై ఆస్ట్రేలియా విజయాన్ని సాధించి సెమీస్‌కు చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టును ఓడించడం టీమిండియా మహిళలకు అంత సులువు కాదు.

టీమిండియా

ఇరు జట్లలోని సభ్యులు

కేప్ టౌన్‌లో ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఛేజింగ్ జట్లు 21సార్లు గెలిచాయి ఉమెన్స్ టీ20ల్లో భారత్‌పై ఆస్ట్రేలియా 22-6 గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉంది. టీమిండియా నుంచి స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుతంగా రాణిస్తారు. హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుకా సింగ్ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. ఆస్ట్రేలియా తరుపున అలిస్సా హీలీ, మేగాన్ షుట్ రాణిస్తూ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత్: స్మృతిమంధాన, షఫాలీవర్మ, జెమీమారోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌కౌర్ (కెప్టెన్), రిచాఘోష్, దేవికా, దీప్తిశర్మ, వస్త్రాకర్, శిఖాపాండే, గయాక్వాడ్, రేణుకాసింగ్ ఆస్ట్రేలియా: బెత్‌మూనీ, ఎల్లీస్‌పెర్రీ, మెగ్‌లానింగ్, గార్డనర్, మెక్‌గ్రాత్, గ్రేస్‌హారిస్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, మేగన్ షట్, డార్సీ బ్రౌన్