LOADING...
Women's World Cup: సెమీఫైనల్ లో సత్తా చాటిన భారత మహిళ జట్టు.. ఆసీస్ పై గెలిచి ఫైనల్ లోకి ఎంట్రీ 
సెమీఫైనల్ లో సత్తా చాటిన భారత మహిళ జట్టు.. ఆసీస్ పై గెలిచి ఫైనల్ లోకి ఎంట్రీ

Women's World Cup: సెమీఫైనల్ లో సత్తా చాటిన భారత మహిళ జట్టు.. ఆసీస్ పై గెలిచి ఫైనల్ లోకి ఎంట్రీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
10:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాపై భారత మహిళలు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 49.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్‌లో లీచ్ ఫీల్డ్‌ (119)శతకంతో రాణించగా,ఎలీస్ పెర్రీ (77)మంచి సహకారం అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (127 నాటౌట్‌),హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) ల సూపర్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ 48.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయం తో టీమ్‌ ఇండియా ఫైనల్‌ టికెట్‌ ఖరారు చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్