LOADING...
IND vs NZ: తొలి టీ20 మ్యాచ్ లో కివీస్ పై 48 రన్స్ తో టీమిండియా గెలుపు
తొలి టీ20 మ్యాచ్ లో కివీస్ పై 48 రన్స్ తో టీమిండియా గెలుపు

IND vs NZ: తొలి టీ20 మ్యాచ్ లో కివీస్ పై 48 రన్స్ తో టీమిండియా గెలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
10:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ప్రభంజనంలా దూసుకెళ్లి భారీ విజయాన్ని అందుకుంది. 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ 78 పరుగులతో పోరాటం చేసినప్పటికీ ఫలితం మారలేదు. టిమ్‌ రాబిన్‌సన్‌ 21,మార్క్‌ చాప్‌మన్‌ 39,మిచెల్‌ 28 పరుగులు చేశారు.చివర్లో శాంట్నర్‌ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.వరుణ్‌ చక్రవర్తి,శివమ్‌ దూబె చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొలి టీ20లో భారత్‌ ఘన విజయం

Advertisement