Page Loader
ఇండియాలో పుట్టి.. కెన్యా జట్టుకు ప్రాతినిధ్యం
క్రికెటర్ పుష్కర్ శర్మ

ఇండియాలో పుట్టి.. కెన్యా జట్టుకు ప్రాతినిధ్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2022
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన క్రికెటర్ పుష్కర్ శర్మకి అరుదైన అవకాశం లభించింది. కెన్యా జాతీయ జట్టు తరపున ఆడే ఛాన్స్ పొందాడు. ఈ ఏడాది నవంబర్ నెలలో రువాండాలో జరిగిన టోర్నీలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. తన క్రికెట్ కెరీర్‌కు ఎంతగానో సహకరించిన ఇండియా ఫస్ట్ లైఫ్ సంస్థకు పుష్కర్ ధన్యవాదాలు తెలిపాడు. వారి ఆర్ధిక సహకారం లేకపోతే తన కెరీర్‌ ఇంతవరకు వచ్చేది కాదని తెలిపాడు. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సీఈఓ ప్రవీణ్ మీనన్ , పుష్కర్ శర్మ సాధించిన విజయాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అతడిలో టాలెంట్‌ను ముందుగానే గుర్తించిన తాము మద్దతుగా నిలిచామని, భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామని తెలిపారు.

పుష్కర్ శర్మ

పుష్కర్ శర్మ అరుదైన రికార్డులివే..

నైరోబియన్ ప్రొపెన్షియల్ క్రికెట్ అసోసియేషన్ సూపర్ డివిజన్ లీగ్‌లో 14 ఇన్నింగ్స్ లో 841 పరుగులు చేసి తన సత్తాను చాటుకున్నాడు. ACPL కెన్యా T20లో ఛాంపియన్‌షిప్ నిలిచిన జట్టులో పుష్కర్ 115 స్ట్రైక్ రేట్‌తో 228 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా నిర్వహించే 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం ముఖ్యమైన దశ. పుష్కర్ శర్మ తన అద్భుతమైన ఆటతీరుతో, టి20 ప్రపంచకప్‌లో ఆడాలనే కెన్యా కలను సాకారం చేసుకున్న పుష్కర్ భవిష్యతులో బాగా రాణించే అవకాశం ఉంది.