Team India: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు అగ్రస్థానం.. 2027 ప్రపంచకప్‌కు కొత్త విధానం ప్రకటించిన ఐసీసీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 118 రేటింగ్ పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలవగా, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి 102 పాయింట్లతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలోకి చేరింది. ఇక శ్రీలంక 96 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, అఫ్గానిస్థాన్ 93, ఇంగ్లాండ్ 89, బంగ్లాదేశ్ 84, వెస్టిండీస్ 74 పాయింట్లతో తదుపరి స్థానాల్లో నిలిచాయి. గత మూడు సంవత్సరాల్లో జరిగిన వన్డే మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ప్రకటించింది.
వివరాలు
వచ్చే టోర్నీలో 14 జట్లు బరిలోకి..
మే 2025 తర్వాత జరిగిన మ్యాచ్‌లకు పూర్తి స్థాయి పాయింట్లను పరిగణనలోకి తీసుకోగా, అంతకుముందు రెండేళ్ల ఫలితాలకు సగం వెయిటేజీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, 2027 ప్రపంచకప్‌కు సంబంధించిన పోటీ విధానంలో కూడా ఐసీసీ మార్పులు చేసింది. 2023 ప్రపంచకప్‌ను 10 జట్లతో రౌండ్ రాబిన్ విధానంలో నిర్వహించినప్పటికీ, వచ్చే టోర్నీలో 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ జట్లను ఏడు చొప్పున రెండు విభాగాలుగా విభజిస్తారు.
వివరాలు
2027లో ప్రత్యేక అర్హత పోటీలు
ప్రతి విభాగం నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ పోటీలు జరుగుతాయి. 2027 మార్చి 31 నాటికి ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందుతాయి. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే ఆటోమేటిక్‌గా అర్హత సాధిస్తాయి.. మిగిలిన జట్ల ఎంపిక కోసం 2027లో ప్రత్యేక అర్హత పోటీలు నిర్వహించనున్నారు. సహ-ఆతిథ్య దేశమైన నమీబియాకు ఐసీసీ పూర్తి సభ్యత్వం లేకపోవడంతో నేరుగా అర్హత వర్తించదు.