Rinku Singh-Priya Saroj: రింకూ సింగ్,ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్,క్రికెటర్ రింకూ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను (Rinku Singh-Priya Saroj) పెళ్లి చేసుకోనున్నాడు.
వీరిద్దరి మధ్య సంబంధం ఉందని ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రింకూ,ప్రియా పెళ్లి విషయంలో స్పష్టత వచ్చింది.ప్రియా సరోజ్ తండ్రి,ప్రస్తుతం కేరాకట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తుఫానీ సరోజ్ ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు.
రింకూ సింగ్ కుటుంబ సభ్యులతో ప్రియా పెళ్లి గురించి మాట్లాడినట్టు తుఫానీ సరోజ్ చెప్పారు.
ఈ విషయాన్ని ఆయన ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. అలీఘడ్‌లో రింకూ, ప్రియా కుటుంబాల మధ్య పెళ్లి గురించి అర్థవంతమైన చర్చలు జరిగినట్టు తెలిపారు.
ఇరు కుటుంబాలు ఈ వివాహానికి అంగీకరించాయని తుఫానీ సరోజ్ ప్రకటించారు.
వివరాలు
ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి
ఇప్పటివరకు రింకూ, ప్రియా ఉంగరాలు మార్చుకోవడం గానీ, ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.
ప్రియా స్నేహితురాలి తండ్రి ఓ క్రికెటర్ అని, వారి ద్వారా రింకూతో ప్రియాకు పరిచయం ఏర్పడిందని వెల్లడించారు.
గత సంవత్సరం నుంచి రింకూ, ప్రియా మధ్య స్నేహం ఉందని, ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని, కుటుంబ పెద్దల ఆశీర్వాదం కోసం ఎదురుచూశారని తెలిపారు.
ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరుగుతున్నట్టు తుఫానీ సరోజ్ చెప్పారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత రింకూ, ప్రియా తమ నిశ్చితార్థం, వివాహ తేదీలను వెల్లడించనున్నారని ఆయన అన్నారు.
లక్నోలో నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు.
వివరాలు
రింకూ సింగ్ నివాసంలో పెళ్లి విషయమై చర్చలు
జనవరి 22న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో రింకూ సింగ్ పాల్గొననున్నాడు.
అనంతరం అతను ఐపీఎల్‌లో పాల్గొంటాడు. అలీఘడ్‌లోని ఓజోన్ సిటీ వద్ద రింకూ సింగ్ నివాసంలో పెళ్లి విషయమై చర్చలు జరిగినట్టు సమాచారం.
రెండు కుటుంబాలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రియా సరోజ్ వారణాసి సమీపంలోని కర్కియాన్ గ్రామంలో నివసిస్తున్నారు.
సమాజ్‌వాదీ పార్టీతో వీరి కుటుంబం చాలా కాలంగా అనుబంధం కలిగి ఉంది. ఆమె జౌనపుర్ జిల్లాలోని మచిలీషెహర్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వివరాలు
న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ప్రియా
25 ఏళ్ల ప్రియా గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తన తండ్రి తరఫున ప్రచారం నిర్వహించారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రియా, నోయిడాలోని ఆమిటీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.