
Gautam Gambhir: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. కోచ్ గంభీర్ ఏమన్నాడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరగిన భారత్-పాక్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. పాక్ నిర్ణయించిన 128 రన్స్ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది. ఈ విజయం ద్వారా భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, ఈ విజయాన్ని పహల్గాం దాడిలో అమరులైన కుటుంబాలకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసినందుకు భారత సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
Details
దేశానికి గర్వకారణం అయ్యేలా కృషి చేస్తాం
జట్టు ఎల్లప్పుడూ దేశానికి గర్వకారణం అయ్యేలా కృషి చేస్తుందన్నారు. అయితే, హ్యాండ్‌షేక్ ఐడియాను గంభీర్ ప్రతిపాదించారని వార్తలు వచ్చాయి. ఆయన ప్రధానంగా భారత ఆటగాళ్లకు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయవద్దని, చిరకాల ప్రత్యర్థులతో మిశ్రమ సంబంధాలు కొనసాగించవద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే, భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా, పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 రన్స్ మాత్రమే సాధించగలిగింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 44 బంతుల్లో 40 రన్స్, షహీన్ షా అఫ్రిది 16 బంతుల్లో 33 నాటౌట్ రన్స్ సాధించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు, అక్షర్ పటేల్, బుమ్రా రెండు-రెండు వికెట్లు సాధించారు.