Page Loader
IND vs ENG: అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారీ విజయం
అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారీ విజయం

IND vs ENG: అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారీ విజయం

వ్రాసిన వారు Stalin
Oct 29, 2023
09:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నోలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ ప్రపంచ కప్‌లో వరుసగా ఆరో విజయాన్ని టీమిండియా నమోదు చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్‌ను 129పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 229పరుగులు చేసింది. 230పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. 34.5ఓవర్లలో 129పరుగులకే ఆలౌట్ చేసారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో 27పరుగులు చేసిన లివింగ్ స్టోన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షమీ మరోసారి తనదైన స్వింగ్‌తో రెచ్చిపోయారు. నాలుగు వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. బూమ్రా 3వికెట్లు, కుల్దీప్ 2, జడేజా ఒక వికెట్ సాధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీమిండియా వరుసగా ఆరో విజయం