LOADING...
IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ రికార్డు.. టీ20 ప్రపంచకప్‌లో పైచేయి ఎవరిది?
భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ రికార్డు.. టీ20 ప్రపంచకప్‌లో పైచేయి ఎవరిది?

IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ రికార్డు.. టీ20 ప్రపంచకప్‌లో పైచేయి ఎవరిది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే సాగుతుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు అసలైన థ్రిల్ కలుగుతుంది. ఇప్పుడు ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మార్చి 5న ముంబై వేదికగా జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.

Details

గత సెమీఫైనల్స్ చరిత్ర

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం చాటుతూ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. అనంతరం టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది. ఆ ఓటమి భారత అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ జట్టుకు పెద్ద పాఠంగా మారింది. అదే సమయంలో టీ20 వరల్డ్ కప్ 2024 సెమీఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని చిత్తు చేసి, 2022 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ రికార్డు 1-1గా సమమైంది.

Details

2026 సెమీఫైనల్‌పై ఉత్కంఠ

ఇప్పుడంతా దృష్టి 2026 సెమీఫైనల్‌పైనే ఉంది. గతంలో ఒక్కోసారి ఒక్కో జట్టు పైచేయి సాధించడంతో ఈసారి ఎవరు గెలుస్తారన్న ఆసక్తి మరింత పెరిగింది. చరిత్ర చూస్తే ఇరు జట్లు సమానంగా పోటీ పడుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ అసలైన మజాను ఇవ్వడం ఖాయం. ఇప్పటికే ఇరు జట్లు ముంబై చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. వాంఖడే మైదానం చిన్నది కావడంతో పరుగుల వరద పారే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement