
World Cup 2023 : తొలి పోరుకు భారత్ సిద్ధం.. ఇవాళ ఆస్ట్రేలియాతో మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
క్రీడాభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం అసన్నమైంది.
వన్డే ప్రపంచ కప్‌లో ఆదివారం మెగా ఫైట్‌కు రంగం సిద్ధమైంది. భారత్ నేడు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది.
చైన్నైలోని చెపాక్ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల 3 వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్, అదే ఊపుతో బరిలోకి దిగుతోంది.
ఆస్ట్రేలియా బ్యాటర్లు డేవిడ్ వార్నర్, స్టీవన్ స్మిత్, లబుషన్, మార్ష్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. దీంతో వీరిని ఔట్ చేయాలంటే భారత బౌలర్లు చెమటోడ్చాల్సిందే.
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇండియాపై ఆస్ట్రేలియాకే మెరుగైన రికార్డు ఉంది.
Details
ఆస్ట్రేలియాకే మెరుగైన రికార్డు
ఈ రెండు జట్ల ఇప్పటివరకూ మొత్ంత 12 మ్యాచులు జరగ్గా, అందులో ఆసీస్ 8 మ్యాచుల్లో విజయం సాధించింది. మిగతా నాలుగు మ్యాచుల్లో భారత్ నెగ్గింది.
చైన్నై స్టేడియంలో ఈ రెండు జట్లు 3 సార్లు తలపడ్డగా, ఒక మ్యాచులో భారత్ గెలుపొందింది. రెండు మ్యాచులలో ఆసీస్ విజయం సాధించింది.
నేటి మ్యాచులో స్టార్ శుభ్‌మన్ గిల్, హర్థిక్ పాండ్యా ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
గిల్ డెంగ్యూతో బాధపడుతుండగా, పాండ్యా ప్రాక్టీస్ చేస్తుండగా నెట్స్ లో గాయపడ్డాడు. వీరద్దరి ఫిట్ నెస్ బట్టి తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
గిల్ కు చోటు లేకపోతే ఇషాంత్ కిషన్ తుది జట్టులోకి చేరే అవకాశం ఉంటుంది.
Details
ఇండియా, ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లు వీరే!
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటి మ్యాచులో ఒక సెంచరీ సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది. అదే విధంగా మరో మూడు సిక్సులు కొడితే క్రిస్ గేల్(553) సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టనున్నాడు.
భారత్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్/గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్, అశ్విన్, షమీ/జడేజా, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు
వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్, లుబుషేన్, మ్యాక్స్ వెల్, కేరీ, గ్రీన్, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, హేజిల్ వుడ్, జంపా.