Page Loader
India vs Australia: 44రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం
India vs Australia: 44రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం

India vs Australia: 44రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం

వ్రాసిన వారు Stalin
Nov 26, 2023
10:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 44పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 235/4 పరుగులు చేసింది. దీంతో 236 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత బౌలర్లు 191/9 పరుగులకు కట్టడి చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (45), టిమ్ డేవిడ్ (37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడు చొప్పున వికెట్లను పడగొట్టారు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో టీమిండియా