వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి, 43 ఓవర్లకు టీమిండియా చేధించింది. కేఎల్ రాహుల్ చివర వరకు నిలబడి భారత్‌కు గెలుపును అందించారు. అంతకుముందు సిరాజ్, కుల్దీప్ లు చక్కటి బౌలింగ్ తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. శ్రీలంక తరుపున అరంగేట్రం చేసిన ఆటగాడు సువానీదు ఫెర్నాండో పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. సహచర ఓపెనర్ అవిష్క 20 పరుగుల వద్ద నిష్క్రమించిన తర్వాత, ఫెర్నాండో, మెండిస్ (34)తో కలిసి జట్టును నిలబట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. అంతలోనే మెండిస్ అవుట్ కావడంతో శ్రీలంక కష్టాల్లో పడింది.
రెండో వన్డేలో బద్దలైన రికార్డులివే
ఫెర్నాండో తన వన్డే అరంగేట్రంలోనే అర్ధశతకం సాధించిన ఆరో శ్రీలంక బ్యాటర్‌గా నిలిచాడు. అషాన్ ప్రియాంజన్ (74), చమర సిల్వా (55), సిదత్ వెట్టిముని (53*), అషెన్ బండార (50), కుసాల్ మెండిస్ (51) అంతకుముందు స్థానంలో ఉన్నారు. కుల్దీప్ 10 ఓవర్లలో 51 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ వన్డే ఫార్మాట్లలో 200 వికెట్లు తీసిన 23వ భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఎడమ చేతి మణికట్టు-స్పిన్నర్ కుల్దీప్ 107 అంతర్జాతీయ మ్యాచ్‌ల నుండి 23.83 సగటుతో 200 వికెట్లు సాధించి సత్తా చాటాడు. సిరాజ్ 5.54 ఓవర్లలో 3/30, ఉమ్రాన్ 2/48 తో రెండో వన్డేలో అద్భుతంగా రాణించారు.