Page Loader
IND vs BAN: రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారత్
రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారత్

IND vs BAN: రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
10:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టీమ్‌ ఇండియా 297 పరుగులు చేసింది. దీంతో ఇండోర్‌లో శ్రీలంకపై (2017) చేసిన 260 పరుగుల సొంత రికార్డును అధిగమించింది. లక్ష్య చేధనలో బంగ్లా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 133 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బ్యాటర్లు సూర్య కుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ బంగ్లా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. రిషద్‌ వేసిన పదో ఓవర్‌లో సంజూ 30 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే 40 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేశాడు.

Details

సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ 34, హార్దిక్‌ పాండ్య 47 పరుగులు చేయగా.. భారత్ భారీ స్కోరును సాధించింది. బంగ్లా బౌలర్లలో షకీబ్‌ 3, టస్కిన్‌, ముస్తఫిజుర్‌, మహ్మదుల్లా ఒక్కో వికెట్‌ తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిట్టన్ దాస్ (42), తౌహిద్ హృదయ్ 63 పరుగులతో ఫర్వాలేదనిపించారు మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే వెనుతిరిగారు. దీంతో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిషోని తలా ఓ వికెట్ తీశారు. దీంతో మూడు మ్యాచుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

Details

చరిత్ర సృష్టించిన భారత్

టెస్టు హోదాలో ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యధిక స్కోరు ఇదే(297) ఇక టీ20ల్లో భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోరు(297) భారత ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు(22) భారత్ 7.2 ఓవర్లలోనే వంద పరుగుల స్కోరు మార్కును దాటింది 13.6 ఓవర్లలో వేగంగా 200 పరుగుల మార్కును అందుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

133 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం