Loading...
Commonwealth Games: బరిలోకి దిగకుండానే భారత్‌కు తొలి పతకం.. కామన్వెల్త్‌లో లవ్లీనా రికార్డు!
బరిలోకి దిగకుండానే భారత్‌కు తొలి పతకం.. కామన్వెల్త్‌లో లవ్లీనా రికార్డు!

Commonwealth Games: బరిలోకి దిగకుండానే భారత్‌కు తొలి పతకం.. కామన్వెల్త్‌లో లవ్లీనా రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2026
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

స్కాట్లాండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బొర్గొహెయిన్‌ ఒక్క పంచ్‌ కూడా విసరకుండానే సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు ఆమె దృష్టి స్వర్ణ పతకంపైనే ఉంది. బైతోనే సెమీస్‌లోకి లవ్లీనా మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనాకు తొలి రౌండ్‌లో బై లభించింది. దీంతో నేరుగా సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ విభాగంలో మొత్తం ఐదుగురు బాక్సర్లు మాత్రమే పోటీలో ఉండటంతో ఆమెకు తొలి పతకం దాదాపు ఖాయమైంది. ఇప్పటివరకు కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకం సాధించని లవ్లీనా.. ఈసారి ఆ లోటును తీర్చుకోవడమే కాకుండా స్వర్ణ పతకాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

మరో ఎనిమిది మందికి కూడా తొలి రౌండ్‌లో బై

భారత బాక్సింగ్‌ జట్టుకు తొలి రోజే శుభవార్త అందింది. లవ్లీనాతో పాటు మరో ఎనిమిది మంది భారత బాక్సర్లకు కూడా తొలి రౌండ్‌లో బై లభించింది.

శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్‌ పోటీల్లో భారత బాక్సర్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

వివరాలు 

మహిళల విభాగంలో పతకాలపై భారీ ఆశలు

భారత్‌కు మహిళల బాక్సింగ్‌లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

జైస్మీన్‌ లాంబోరియా (57 కేజీలు) గత కామన్వెల్త్‌ గేమ్స్‌ (2022)లో కాంస్య పతకం సాధించింది. ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో స్వర్ణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రియ ఘంఘాస్‌ (60 కేజీలు), ప్రీతి పవార్‌ (54 కేజీలు), అరుంధతి (70 కేజీలు)పై కూడా పతక ఆశలు ఉన్నాయి. సాక్షి చౌదరి ఈసారి 54 కేజీల నుంచి 51 కేజీల విభాగానికి మారి పోటీలోకి దిగుతోంది.

సెలక్షన్‌ ట్రయల్స్‌లో స్టార్‌ బాక్సర్లు నిఖత్‌ జరీన్, మీనాక్షి హుడాలను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించిన సాక్షి నుంచి కూడా మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పురుషుల విభాగంలో అరంగేట్ర బాక్సర్ల పరీక్ష

పురుషుల విభాగంలో భారత జట్టులో ఎక్కువ మంది అరంగేట్ర బాక్సర్లు ఉండటం విశేషం. వీరిలో జాదుమణి సింగ్‌ (55 కేజీలు)పై భారత్‌ ప్రధాన పతక ఆశలు పెట్టుకుంది.

అలాగే ఆదిత్య ప్రతాప్‌ సింగ్‌ (65 కేజీలు), సచిన్‌ సివాచ్‌ (60 కేజీలు), సుమిత్‌ కుండు (70 కేజీలు), అంకుశ్‌ (80 కేజీలు), కపిల్‌ పొకారియా (90 కేజీలు), నరేందర్‌ బెర్వాల్‌ (+90 కేజీలు) తమ ప్రదర్శనతో ఎంతవరకు ఆకట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలి పతకం ఇప్పటికే ఖాయమైన నేపథ్యంలో.. భారత బాక్సర్లు మరిన్ని పతకాలు సాధించి దేశానికి ఘనత తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ADVERTISEMENT