తదుపరి వార్తా కథనం
IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 05, 2025
09:04 am
ఈ వార్తాకథనం ఏంటి
సిడ్నీ టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా 3-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది.
ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 41 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ (34*), వెబ్‌స్టర్ (39*) అజేయంగా నిలిచారు. సామ్ కోనస్టాస్ 22 పరుగులతో మెరుగైన ప్రదర్శనను కనబరిచారు.
భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు తీసుకోగా, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ సాధించారు.
అయితే వెన్నునొప్పితో బాధపడుతున్న జస్ప్రిత్ బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు.