LOADING...
IND vs AFG: అఫ్గాన్‌పై భారత్ చారిత్రాత్మక విజయం.. టెస్టుల్లో అతిపెద్ద గెలుపు నమోదు!
అఫ్గాన్‌పై భారత్ చారిత్రాత్మక విజయం.. టెస్టుల్లో అతిపెద్ద గెలుపు నమోదు!

IND vs AFG: అఫ్గాన్‌పై భారత్ చారిత్రాత్మక విజయం.. టెస్టుల్లో అతిపెద్ద గెలుపు నమోదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్, టెస్టు క్రికెట్‌లో తన అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. మూడో రోజు ఆటను 113/5 స్కోరుతో ప్రారంభించిన అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా 135 బంతుల్లో 60 పరుగులు చేసి అర్ధశతకం నమోదు చేయగా, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

వివరాలు

రెండో ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన అప్గాన్ బ్యాటర్లు

భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా అఫ్గానిస్థాన్‌ను ఫాలోఆన్ ఆడించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ అఫ్గాన్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. టీ విరామ సమయానికి 98/5తో ఉన్న ఆ జట్టు, చివరి సెషన్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. 1 12 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్, షరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాకపోవడంతో అక్కడితో ముగిసింది. అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సెథిఖుల్లా అటల్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహ్మనుల్లా గుర్బాజ్ 24, రహ్మత్ షా 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.

వివరాలు

4 వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ సుందర్

భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 36 పరుగులకు 4 వికెట్లు, కుల్‌దీప్ యాదవ్ 30 పరుగులకు 3 వికెట్లు తీసి అఫ్గాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 33 పరుగులకు 6 వికెట్లు తీసి ఆకట్టుకోగా, ప్రసిద్ధ్ కృష్ణ 37 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 564/8 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 126 పరుగులతో సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ 100 పరుగులతో శతకం పూర్తి చేశాడు.

Advertisement

వివరాలు

300 పరుగుల తేడాతో గెలుపు

సాయి సుదర్శన్, రిషభ్ పంత్ చెరో 81 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. మానవ్ సుతార్ 28, యశస్వి జైస్వాల్ 24, ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో టీమిండియా టెస్టు క్రికెట్‌లో ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల తేడాతో గెలిచి కొత్త రికార్డు నెలకొల్పింది.

Advertisement