Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో ఇవాళ భారత్ షెడ్యూల్ ఇదే.. భారత్‌కు ముఖ్యమైన రోజు
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇప్పటివరకూ భారత్ 3 పతకాలను మాత్రమే సాధించింది. ఈరోజు భారత్ కు పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో బంగారు పతకం కోసం గురువారం పోటీపడుతున్నారు. మరోవైపు హాకీలో భారత పురుషుల జట్టు కాంస్య పతక పోరులో భాగంగా స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ ఫామ్ చూస్తే కాంస్యం కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఇవాళ అథ్లెటిక్స్, గోల్ఫ్, రెజ్లింగ్, హాకీ మ్యాచులు జరుగుతాయి. అయితే భారత్ షెడ్యూల్ తెలుసుకోండి
భారత షెడ్యూల్ ఇదే
గోల్ఫ్ మహిళల వ్యక్తిగతం: అదితి అశోక్ మరియు దీక్షా దాగర్ - మధ్యాహ్నం 12.30 అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్: జ్యోతి యారాజీ - మధ్యాహ్నం 2.05 పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా - రాత్రి 11.55 రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు (ప్రీ క్వార్టర్ ఫైనల్): అమన్ సెహ్రావత్ - 2.30 మధ్యాహ్నం మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీలు (ప్రీ-క్వార్టర్ ఫైనల్): అన్షు మాలిక్ - మధ్యాహ్నం 2:30 హాకీ పురుషుల కాంస్య పతక మ్యాచ్: భారత్ vs స్పెయిన్: సాయంత్రం 5.30