T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ గాయంతో ఔట్?
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026కు ముందే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అతడు కేవలం ఒకే ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి 16 పరుగులు ఇచ్చాడు.
Details
అసలేం ఏం జరిగిందంటే?
241 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను హర్షిత్ రాణా వేశాడు. ఇదే అతడికి ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్. అయితే బౌలింగ్ చేసేందుకు రన్‌అప్ తీసుకుంటున్న సమయంలో అతడు అసౌకర్యానికి గురైనట్లు కనిపించాడు. అదే ఓవర్‌లో రెండు సార్లు ఇబ్బంది పడుతూ ఆగిపోయాడు. అయినప్పటికీ ఓవర్‌ను పూర్తి చేశాడు. ఓవర్ అనంతరం హర్షిత్ తన మోకాలిని పట్టుకుని తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించాడు. నొప్పి ఎక్కువ కావడంతో మరో ఓవర్ కూడా వేయకుండానే మైదానం విడిచిపెట్టాడు.
Details
గాయం కారణంగా ఇబ్బంది హర్షిత్ రాణా
ఆ తర్వాత అతడు మళ్లీ మైదానంలో కనిపించలేదు. హర్షిత్ రాణా గాయంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. ఒకవేళ గాయం తీవ్రంగా ఉండి అతడు ప్రపంచకప్‌కు దూరమైతే అది టీమిండియాకు గట్టి షాక్‌గా మారనుంది. ఎందుకంటే హర్షిత్ కేవలం పేసర్ మాత్రమే కాదు.. అవసరమైనప్పుడు ఓ మోస్తరు బ్యాటింగ్ కూడా చేయగల ఆటగాడు.
Details
ఇంకా కోలుకోని వాషింగ్టన్ సుందర్
ఇదిలా ఉండగా, మరో కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కూడా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. గత నెల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్, కివీస్‌తో జరిగిన మిగిలిన వన్డేలు మరియు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ కొనసాగిస్తున్నాడు. ఇంకా అతడి స్థానంలో జట్టులో ఎవ్వరిని ఎంపిక చేయలేదు. ఫిబ్రవరి 7న టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గ్రూప్ దశలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, సూపర్-8 దశకు వచ్చేలోపు వాషింగ్టన్ సుందర్ కోలుకుంటాడని జట్టు వర్గాలు ఆశిస్తున్నాయి.