Page Loader
IND vs ENG: ఫోర్త్ టెస్టులో భారత్‌కు షాక్.. ఇంగ్లండ్ తుది జట్టులోకి లియామ్ డాసన్
ఫోర్త్ టెస్టులో భారత్‌కు షాక్.. ఇంగ్లండ్ తుది జట్టులోకి లియామ్ డాసన్

IND vs ENG: ఫోర్త్ టెస్టులో భారత్‌కు షాక్.. ఇంగ్లండ్ తుది జట్టులోకి లియామ్ డాసన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టు ఈనెల 23న (బుధవారం) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ మైదానంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సంపాదించుకోవాలని ఆశిస్తోంది. ఈ లక్ష్యంతోనే తన తుది జట్టులో కీలక మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్‌ను ఎంపిక చేసింది. ఎనిమిదేళ్ల విరామం అనంతరం డాసన్‌ టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.

Details

అద్భుత ఫామ్ లో ఆడిన డాసన్

అతను చివరిసారిగా 2017లో నాటింగ్‌హామ్ వేదికగా దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడగా, 2016లో భారత్‌కి వ్యతిరేకంగా చెన్నైలో తన టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తం మూడు టెస్టులు ఆడిన డాసన్, 7 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌ లో 66 పరుగులు చేశాడు. గత కొన్నేళ్లుగా టీ20 లీగ్‌ల్లో రాణిస్తున్న అతడు, ఇప్పుడు టెస్టు వేదికపై భారత్‌ బ్యాటర్లను ఎంతవరకు బెంబేలెత్తిస్తాడో చూడాలి. ఇక ఫోర్త్ టెస్టు కోసం ఇంగ్లండ్ ప్రకటించిన తుది జట్టు వివరాలివే జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియమ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.