India vs England: తడబడిన టీమిండియా బ్యాటర్లు.. ఇంగ్లాండ్ టార్గెట్ 230
వన్డే ప్రపంచ కప్‌లో భాగాంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తడపడింది. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాాడు. 87పరుగులు చేసి.. జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక సూర్యకురుమార్ యాదవ్ 49పరుగులతో రాణించాడు. కింగ్ కోహ్లీ డకౌట్ కావడం గమనార్హం. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో విల్లే 3 వికెట్లు తీసుకున్నాడు. రషీద్, వోక్స్ రెండు చొప్పున, మార్క్ వుడ్ ఒక వికెట్ సాధించారు.