Page Loader
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టు సెంచరీ.. 
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టు సెంచరీ..

IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టు సెంచరీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) సెంచరీ సాధించాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే ఈ ప్రత్యేక మార్క్‌ను తాకాడు. ఇది అతడి కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీగా చెబుతారు. నాలుగో టెస్టులోనే శతకం పూర్తి చేయడం విశేషం. ఓవర్‌నైట్ 70 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సర్ఫరాజ్ ఏ దశలోనూ తడబాటుకు గురి కాలేదు. అతను చూడచక్కని షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. ఆఫ్‌సైడ్ లేట్ కట్టర్లతో బౌండరీలు రాబట్టాడు.

వివరాలు 

వన్డే తరహాలో కివీస్ బౌలర్లపై.. 

రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.కేవలం 110 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో శతకాన్ని పూర్తి చేశాడు. వన్డే తరహాలో కివీస్ బౌలర్లపై ఈ ముంబైకర్ విరుచుకుపడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం సర్ఫరాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేయగా, భారత్ 46 పరుగులకే ఆలౌటైంది.