Page Loader
ఆసియా కప్ : నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. 90శాతం వర్ష సూచన
నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. 90 శాతం వర్ష సూచన

ఆసియా కప్ : నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. 90శాతం వర్ష సూచన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 10, 2023
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ మధ్య మరో సమరానికి తెెరలేచింది. సూపర్‌-4 దశలో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ ఇరు జట్లు తలపడనున్నాయి. లీగ్‌ దశలో సెప్టెంబర్ 2న భారత్, పాక్‌ తలపడగా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయ్యింది. దీంతో అభిమానుల కోరిక మేరకు ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌ను రిజర్వ్‌ డేగా ప్రకటించారు. ఆదివారం జరిగే మ్యాచ్‌కు 90శాతం వర్ష గండం ఉన్నట్లు వాతావరణ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పిచ్‌ బౌలర్లకే అనుకూలంగా విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి సమరంలో టీమిండియా బ్యాటింగ్‌లో తడబడింది. హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌ బ్యాట్‌కు పనిచెప్పడంతో మోస్తరు స్కోరును చేయగలిగింది.

details

అందరి దృష్టి రాహుల్‌పైనే 

పాక్‌తో మ్యాచ్‌లో అందరి దృష్టి రాహుల్‌పైనే ఉంది. మరోవైపు బుమ్రా కూడా జట్టుతో చేరాడు. హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రపంచ కప్‌ ప్రణాళికల్లో భాగంగానే కేఎల్‌ రాహుల్‌ను అన్ని విధాలా పరీక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అంచనా. మరోవైపు రోహిత్, గిల్, కోహ్లి స్కోరు బోర్డుకు బలమైన పునాది వేస్తారని అంతా భావిస్తున్నారు. బౌలింగ్‌ విభాగం బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్‌లతో పటిష్టంగా ఉంది. ఆల్‌ రౌండర్‌గా శార్దుల్‌కు ఇది మరో కీలక అవకాశంగా మారనుంది. పాక్ పేస్‌ బౌలింగ్‌ త్రయం షాహిన్, రవూఫ్, నసీమ్‌ పదునైన బౌలింగ్‌ దళంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్‌ను పాక్ ఫేస్ ఇబ్బంది పెట్టిన దృష్ట్యా నేటి మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.