
ఆసియా కప్: కేఎల్ రాహుల్ రాకతో సంజూ శాంసన్‌కు ఉద్వాసన.. నెట్టింట ట్రోల్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌కు అదనపు ఆటగాడిగా ఎంపికైన టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తిరుగుముఖం పట్టాడు. పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ జట్టులోకి చేరారు. దీంతో జట్టు యాజమాన్యం సంజూని భారత్ పంపించేసింది. ఈ క్రమంలోనే సంజూ శ్రీలంకను వీడాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న రాహుల్, ప్రస్తుతం ఫామ్‌లోకి రావడంతో సంజూని వెనక్కి పిలిపించారు. మరోవైపు బీసీసీఐ, సెలెక్టర్ల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసియా కప్, ప్రపంచ కప్, ఆసియన్ గేమ్స్ లాంటి టోర్నీల్లో ఒక్క మ్యాచ్ లోనూ సంజూను తీసుకోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత్‌కు సంజూ తిరుగుపయనం
KL Rahul all in readiness for wicket-keeping duties, Sanju Samson sent back home ahead of IND vs PAK clash.#AsiaCup2023 #KLRahul #TeamIndia #INDvsPAK PAK pic.twitter.com/h3ewP1WCHP
— Sagar Rath (@sagar_rath) September 9, 2023