Page Loader
U19 IND w Vs SCO w: స్కాట్లాండ్ ను చిత్తు చేసిన భారత్.. త్రిష రికార్డు సెంచరీ
స్కాట్లాండ్ ను చిత్తు చేసిన భారత్.. త్రిష రికార్డు సెంచరీ

U19 IND w Vs SCO w: స్కాట్లాండ్ ను చిత్తు చేసిన భారత్.. త్రిష రికార్డు సెంచరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 మహిళల వరల్డ్‌ కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థిపై 150 పరుగుల భారీ తేడాతో గెలిచి మరోసారి తన సత్తా చాటింది. 208 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ 14 ఓవర్లలో కేవలం 58 పరుగులకే ఆలౌటైంది. స్కాట్లాండ్‌ తరఫున పిప్పా (12), వాల్‌సింగమ్‌ (12) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో శుక్ల 4 వికెట్లు పడగొట్టగా, వైష్ణవి శర్మ, త్రిష చెరో 3 వికెట్లు తీసి స్కాట్లాండ్‌ను కట్టడి చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 208 పరుగులు సాధించింది.

Details

సెమీస్ కు చేరిన భారత్

భారత్ విజయంలో తెలుగు యువ క్రికెటర్‌ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. త్రిష కేవలం 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. కేవలం 53 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసిన త్రిష, అండర్-19 టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. త్రిష, కమలిని కలిసి తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం అందించారు. కమలిని హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక ఔట్‌ అయినా త్రిష మాత్రం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. సానికాతో కలిసి రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించి సత్తా చాటింది. ఈ విజయంతో ఇప్పటికే సెమీస్‌కు భారత్ సెమీస్‌కు చేరుకుంది.