Page Loader
ENG vs IND: రెండో టెస్టులో భారత్ గెలుపు.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయం నమోదు
రెండో టెస్టులో భారత్ గెలుపు.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయం నమోదు

ENG vs IND: రెండో టెస్టులో భారత్ గెలుపు.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయం నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
09:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. అండర్సన్-టెందూల్కర్ ట్రోఫీలో భాగంగా ఈ మ్యాచ్‌లో గిల్‌ సేన 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో భారత్ 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఐదో రోజు 72/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ప్రారంభించి 271 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టుకు జేమీ స్మిత్ (99 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే ధీటుగా పోరాడాడు.

Details

ఆరు వికెట్లతో చెలరేగిన ఆకాశ్ దీప్

అతనికి బ్రైడన్ కార్స్ (38), కెప్టెన్ బెన్ స్టోక్స్(33), ఓలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (23) కొంత మద్దతుగా నిలిచారు. భారత బౌలర్లలో పేసర్ ఆకాశ్ దీప్ ఒక్కడే 6 వికెట్లు (6/99) తీసి ఇంగ్లాండ్‌ను కట్టడి చేశాడు. అతడితో పాటు సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, జడేజా ఒక్కో వికెట్‌ తీశారు. మ్యాచ్ ప్రారంభంలో భారత్ తొలుత బ్యాటింగ్‌ చేసి 587 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తమ లక్ష్యాన్ని చేరడంలో పూర్తిగా విఫలమైంది. ఈవిజయం ద్వారా భారత్‌ టెస్టు సిరీస్‌ను బలోపేతం చేయడమే కాకుండా, ఎడ్జ్‌బాస్టన్‌లో గత వైఫల్యాలకు ముగింపు పలికింది.