LOADING...
India Women: ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలుపు లక్ష్యంగా భారత మహిళలు
ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలుపు లక్ష్యంగా భారత మహిళలు

India Women: ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలుపు లక్ష్యంగా భారత మహిళలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి సారించింది. మొదటి టీ20లో విజయాన్ని అందుకుని ఉత్సాహంగా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని జట్టు, రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్‌ను ఖాయం చేయాలని సంకల్పించింది. ఈ రెండో టీ20 పోరు గురువారం కాన్‌బెరా వేదికగా జరగనుంది. వర్షం కారణంగా ప్రభావితమైన తొలి మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్-లూయిస్ నియమం ప్రకారం 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ పోరులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అరుంధతి రెడ్డి 4 వికెట్లకు 22 పరుగులు మాత్రమే ఇచ్చి మెప్పించగా,రేణుక సింగ్ 2 వికెట్లకు 14 పరుగులు ఇచ్చి కీలక పాత్ర పోషించారు.

వివరాలు 

స్వదేశంలో నిలదొక్కుకోవాలని ఆస్ట్రేలియా ప్రయత్నం

బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన, షఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద బలంగా మారింది. అలాగే స్పిన్ విభాగంలో దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి సమర్థంగా రాణిస్తూ జట్టును మరింత బలపరుస్తున్నారు. మరోవైపు, స్వదేశంలో సిరీస్‌ను నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో సోఫీ మోలిన్యూ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు కూడా గట్టి పోరాటానికి సిద్ధమవుతోంది.

Advertisement