8వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం
ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్‌లో జరిగిన టీ20 ట్రై-సిరీస్ ఆరో మ్యాచ్‌లో సోమవారం వెస్టిండీస్ మహిళలపై భారత్ మహిళలు 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. దీప్తిశర్మ (3/11)తో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్ 6వికెట్ల నష్టానికి 94 పరుగులే చేయగలిగింది. భారత మహిళా జట్టు కేవలం 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ 42 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీయడంతో వెస్టిండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కి క్యూ కట్టారు. హేలీ మథ్యూస్ మాత్రమే 36 పరుగులను చేయగలిగింది. టీమిండియా బౌలర్ దీప్తి నాలుగు ఓవర్లు వేసి, అందులో రెండు ఓవర్లు మెయిడిన్ చేసింది.
ఐదోవ ప్లేయర్‌గా రికార్డుకెక్కిన హర్మన్‌ప్రీత్
86 మ్యాచ్ లు ఆడిన దీప్తి 19.30 సగటుతో 95 వికెట్లను పడగొట్టింది. వెస్టిండీస్ మహిళలతో ఏడు మ్యాచ్ లు ఆడి 14 వికెట్లను సాధించింది. వస్త్రాకర్ 42 మ్యాచ్లు ఆడి 22.39 సగటుతో 28 వికెట్లను తీసింది. హర్మన్‌ప్రీత్ ఇప్పుడు అంతర్జాతీయ మహిళల 20 క్రికెట్లో 2,900 పరుగులు చేసిన 5వ ప్లేయర్ గా రికార్డుకెక్కింది. ఆమె ప్రస్తుతం 28.33 సగటుతో 2,919 పరుగులు చేసి సత్తా చాటింది.