Page Loader
దక్షిణాఫ్రికా  సిరీస్‌పై‌ కన్నేసిన షఫాలీ వర్మ
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న భారత మహిళా ప్లేయర్లు

దక్షిణాఫ్రికా సిరీస్‌పై‌ కన్నేసిన షఫాలీ వర్మ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 30, 2023
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. భారత బౌలర్లలో టైటాస్ సాదు, చోప్రా, అర్చన దేవీలు తలో రెండు వికెట్లు తీశారు. షెఫాలీ వర్మ 15 రన్స్, శ్వేత షెరవాత్ 5 రన్స్ తొందరానే ఔట్ అయ్యారు. సౌమ్య తివారీ 24 రన్స్, త్రిష 24 రన్స్ చక్కటి బ్యాటింగ్‌తో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది.

టీమిండియా

కన్నీళ్లు పెట్టుకున్న షఫాలీ వర్మ

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ మరో టైటిల్‌పై కన్నేసింది. షఫాలీ ఇప్పటికే భారత మహిళల జట్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. వచ్చే నెలలో జరిగే టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతం ముగించాలని భావిస్తోంది. వరల్డ్ కప్ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ షఫాలీ వర్మ కన్నీళ్లు పెట్టుకుంది. కప్ గెలిచినందుకు సంతోషంగా ఉందని, అద్భుతమైన జట్టును తనకు అందించి, అన్ని విధాలా అండగా నిలిచిన బీసీసీఐకి షఫాలీ వర్మ ధన్యవాదాలు తెలిపారు. తాను అండర్-19లో అడుగుపెట్టినప్పుడు, అండర్-19 కప్ గెలవడంపై మాత్రమే దృష్టి పెట్టానని, ఈసారి వరల్డ్ ప్రపంచకప్‌ను కచ్చితంగా సాధిస్తామని షఫాలీ శర్మ ధీమా వ్యక్తం చేశారు.