Paralympics: జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నవదీప్
పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను చాటారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41 విభాగంలో నవదీప్ స్వర్ణ పతకం గెలిచి చరిత్రకెక్కాడు. మొదట నవదీప్ రజత పతకాన్ని సాధించగా,ఇరాన్ అథ్లెట్ ఖాతాలోకి స్వర్ణం వెళ్లింది. కానీ, అథ్లెట్‌పై అనర్హత కారణంగా చర్యలు తీసుకోవడంతో బంగారు పతకం భారత్‌కు మారింది. ఇదే విభాగంలో నవదీప్ స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నిలిచాడు. మరోవైపు, మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్య పతకం గెలిచింది. ఈ విజయాలతో పారా ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 29కి చేరుకుంది, దేశ కీర్తిని మరింత వెలుగులోకి తెచ్చారు.