తదుపరి వార్తా కథనం

Asian Games 2023 : 22వ గోల్డ్ మెడల్‌ను సాధించిన భారత్.. మెన్స్ హాకీలో స్వర్ణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 06, 2023
07:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది.
తాజాగా భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం మెన్స్ హకీ ఫైనల్లో హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో భారత జట్టు జపాన్ పై విజయం సాధించి గోల్డ్ మెడల్‌ను సాధించింది.
ఈ స్వర్ణంతో భారత్ ఇప్పటివరకూ 22 గోల్డ్ మెడల్స్ ను సాధించింది. హాకీ ఫైనల్ మ్యాచులో భారత్ ఆది నుంచి ఆదిపత్యం ప్రదర్శించింది.
చివరికి 5-1 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది.
ఈ పతకంలో కలిపి ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకూ మొత్తం 4 బంగారు పతకాలను సాధించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్ పై భారత్ విజయం
Hangzhou Asian Games: Indian Hockey team beat Japan 5-1 to win gold medal and qualify for Paris Olympics 2024 pic.twitter.com/av5WZ4bB8E
— ANI (@ANI) October 6, 2023