తదుపరి వార్తా కథనం

IND vs WI: తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టు ఘన విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 04, 2025
02:00 pm
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. బౌలర్ల ధాటికి ప్రత్యర్థి ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో మట్టికరిపింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 146 పరుగులకే ఆలౌటైంది. ఇందులో అలిక్ 38, జస్టిన్ 25 పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ కేవలం 162 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ 448/5 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని చివరికి ఘన విజయాన్ని నమోదు చేసింది.