Page Loader
రెండోసారి ఇంటర్ కాంటినెంటల్‌కప్ ఛాంపియన్‌గా భారత్.. ఓడిశా నగదు బహుమానం
ఇంటర్ కాంటినెంటల్ కప్‌ విజేత భారత జట్టు

రెండోసారి ఇంటర్ కాంటినెంటల్‌కప్ ఛాంపియన్‌గా భారత్.. ఓడిశా నగదు బహుమానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 19, 2023
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ ఫుట్ బాల్ జట్టు సంచలనం సృష్టించింది. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లైబనాస్‌పై 2-0 తేడాతో గెలుపొందింది. స్టార్ ఆటగాడు సునీల్ ఛైత్రీ 46వ నిమిషంలో జట్టుకు తొలి గోల్ అందించాడు. 66వ నిమిషంలో లల్లియంజుల ఛాంగ్టే రెండో గోల్ సాధించాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కాగా, ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో విజేతగా నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు జట్టుకు రూ. కోటి నగదు బహుమానం ప్రకటించాడు. అఖిల భార‌త ఫుట్‌బాల్ స‌మాఖ్య నాలుగు దేశాల మ‌ధ్య ఈ టోర్నీని నిర్వ‌హిస్తోంది. ఇందులో భార‌త్, లెబ‌నాన్, మంగోలియా, వ‌నౌతు దేశాలు పాల్గొంటున్నాయి.

Details

భవిష్యత్తులో మరెన్నో ఫుట్ బాల్ ఈవెంట్లు

ప్రతిష్టాత్మకమైన ఇంటర్ కాంటినెంటల్ కప్‌కు ఒడిశా ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని, గట్టి పోటీని ఎదుర్కొంటూ భారత పురుషుల జట్టు విజయం సాధించినందుకు అభినందనలని, ఒడిశాలో మరెన్నో ఫుట్‌బాల్ ఈవెంట్‌లు నిర్వహించి క్రీడాభివృద్ధికి తోడ్పాటునందిస్తామని నవీన్ పట్నాయక్ తెలిపారు. మ్యాచ్ విషయానికొస్తే తొలి అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్ల ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే రెండో అర్ధభాగం మొదలైన కాసేపటికే కెప్టెన్ ఛైత్రీ గోల్ కొట్టడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. లల్లియంజుల మరో గోల్ సాధించడంతో టీమిండియా విజయాతీరాలకు చేరింది. దీంతో రెండోసారి నాలుగు దేశాల ఇంటర్‌కాంటినెంటర్ కప్ ఛాంపియన్ గా భారత హకీ జట్టు నిలిచింది.