Page Loader
బంగ్లాదేశ్ చిత్తు.. ఉమెన్స్ ఆసియా కప్ విజేతగా భారత్
ఆసియా కప్ విజేతగా భారత మహిళల జట్టు

బంగ్లాదేశ్ చిత్తు.. ఉమెన్స్ ఆసియా కప్ విజేతగా భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2023
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ఛాంపియన్స్‌గా భారత మహిళల జట్టు అవతరించింది. శ్వేతా సెహ్రావత్ సారథ్యంలోని ఇండియా ఎ జట్టు ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది. హాంకాంగ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ సెహ్రావత్ (13), ఉమా చెత్రీ (20) నిరాశపరిచగా, దినేష్ బృందా 29 బంతుల్లో 36 పరుగులు, కనిక అహుజా 23 బంతుల్లో 30 పరుగులతో రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది.

Details

నాలుగు వికెట్లతో చెలరేగిన శ్రేయాంక్ పాటిల్

127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. శ్రేయాంక్ పాటిల్ నాలుగు వికెట్లతో విజృంభించింది. మున్నత్ కశ్యప్ మూడు, కనిజా అహుజా రెండు వికెట్లు పడగొట్టారు. బాంగ్లాదేశ్ ఆటగాళ్లలో నహీదా అక్తర్ 17 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. అయితే హాంకాంగ్ వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియాకప్ టోర్నీలో చాలా మ్యాచులు వర్షం కారణంగా రద్దు కాగా.. భారత్ లీగ్ దశలో ఒక మ్యాచును ఆడింది. తొలి మ్యాచులో హాంకాంగ్‌ను 34 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్, లక్ష్యాన్ని 5.2 ఓవర్లలోనే చేధించింది.సెమీస్ రద్దు కావడంతో లీగ్ దశలో టాపర్‌గా ఉన్న భారత్ ఫైనల్‌కు చేరి విజయం సాధించింది.