Page Loader
11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు 
భారత మహిళల జట్టు

11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2023
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాణించినా భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచు ఆడేందుకు సిద్ధమవుతున్నారు. భారత మహిళల జట్టు జూలైలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. టీమిండియా టూర్ గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు షఫియుల్ అలమ్ చౌధురి నదెల్ ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టు టీమిండియా మహిళా జట్టుత జులైలో వన్డే సిరీస్ ను ఆడనుందని, ఈ మ్యాచులన్నీ షేర్-ఇ-బంగ్లా నేషన్ క్రికెట్ మైదానంలో జరుగుతాయని ఆమె చెప్పారు.

Details

భారత మహిళల జట్టు షెడ్యూల్ ఇదే

బంగ్లాదేశ్ గడ్డపై మహిళా క్రికెట్ మ్యాచులు నిర్వహించడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. చివరి సారిగా 2012లో బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో తలపడిన విషయం తెలిసిందే. జూలై 9న జరిగే తొలి టీ20ల్లో బంగ్లా, భారత మహిళల జట్లు తలపడనున్నాయి. జులై 11న రెండో టీ20, మూడో టీ20 జూలై 13న జరగనుంది. తొలి వ‌న్డే జూలై 16న జ‌ర‌గ‌నుంది. రెండో వ‌న్డే 19న‌, 22న మూడో వ‌న్డే మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు