Page Loader
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది: పాక్ మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది: పాక్ మాజీ కెప్టెన్

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది: పాక్ మాజీ కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2023
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత శర్మ సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నా ఐసీసీ మెగా టోర్నీలో మాత్రం టీమిండియాను విజేతగా నిలపలేకపోతున్నాడు. రోహిత్ సారథ్యంలో 2022 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ పరాజయం పాలైంది. అయితే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కూడా ఐసీసీ టోర్నీల్లో భారత్ ను విజేతగా నిలపలేదు. ఈ తరుణంలో టీమిండియా గురించి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే వన్డే ప్రపంచకప్‌నకు భారత్ సరైన విధంగా సిద్ధమై ఉండేదన్నారు.

Details

బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం వల్లే భారత్ ఓటమి

మిడిల్, లోయర్ బ్యాటింగ్ ఆర్డర్‌‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ మార్పులు చేయడం వల్ల, ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమిపాలైందని రషీద్ లతీఫ్ చెప్పారు. టీమిండియా యాజమాన్యం చాలామంది ఆటగాళ్లతో ప్రయోగాలను చేసిందని, కొత్త ఆటగాళ్లను స్థిరంగా ఒక స్థానంలో ఆడించకుండా మార్పులు చేసి తప్పులు చేసిందన్నారు. శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చే అవకాశం ఉందని, అయితే ప్రపంచ కప్‌లో భారత్ సీనియర్లపైనే ఆధారపడాలని చెప్పుకొచ్చారు.