Page Loader
రాయపూర్ వన్డేలో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు, కివీస్ 108 ఆలౌట్
రెండో వన్డేలో మూడు వికెట్లు తీసిన షమీ

రాయపూర్ వన్డేలో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు, కివీస్ 108 ఆలౌట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2023
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయపూర్ వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ ఆటగాళ్లకు ఇండియన్ పేసర్లు చెమటలు పుట్టించడంతో తక్కువ స్కోర్ కే కివీస్‌ను కుప్పకూల్చారు టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ ఫీన్ అలెన్ డకౌట్ కాగా..ఆ తరువాత క్రిజ్‌లోకి వచ్చిన నికోల్స్ వచ్చాడు. డేవన్ కాన్వే, నికోల్స్ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్ (2) పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రిజ్‌లోకి వచ్చిన డారి మిచెల్ (1) పరుగుకే షమీ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. కేవలం 15 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇండియా

న్యూజిలాండ్ 108 పరుగులకు ఆలౌట్

మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు భారత బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. 108 పరుగులకే న్యూజిలాండ్‌ ఆలౌట్‌ అయింది. కివీస్‌ బ్యాటర్లలో 36రన్స్‌తో ఫిలిప్స్‌ టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. అయితే భారత బౌలర్లలో షమి 3వికెట్లు తీసి కివీస్‌ పతనాన్ని శాసించాడు, సుందర్, పాండ్యా రెండేసి వికెట్లు తీయగా. సిరాజ్, శార్దూల్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ తీసి న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచారు.