Page Loader
చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్ సవితా శ్రీ భాస్కర్
భారత్ చెస్ ప్లేయర్ సవితా శ్రీ భాస్కర్

చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్ సవితా శ్రీ భాస్కర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2022
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ చెస్ ప్లేయర్ సవితాశ్రీ భాస్కర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. కజకిస్తాన్‌లో జరిగిన ఎఫ్‌ఐడీఈ (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన మూడో భారత చెస్ ప్లేయర్‌గా నిలిచి అరుదైన ఘనత తన సొంతం చేసుకుంది. భారత గ్రాండ్‌ మాస్టర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, మహిళా చెస్ ప్లేయర్ కొనేరు హంపి మాత్రమే గతంలో వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచారు.

సవితా శ్రీ భాస్కర్

13వేల డాలర్లు ప్రైజ్ మనీ

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టోర్నిలో పాల్గొని 11 మ్యాచ్ లు ఆడింది. అందులో ఎనిమిది విజయాలు సాధించి, కాంస్య గెలుచుకుంది. వరల్డ్ 79వ ర్యాంకులో ఉన్న సవితాశ్రీ భాస్కర్, ఈ విజయంతో 13 వేల డాలర్లు ప్రైజ్ మనీగా దక్కించుకుంది.. 2007లో జన్మించిన సవితా శ్రీ భాస్కర్.. రెండు నెలల గ్యాప్‌లో 3 వందలకు పైగా పాయింట్లు సాధించారు. సవితా శ్రీ భాస్కర్ తండ్రి భాస్కర్, సింగపూర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. కూతురి కోసం ఉద్యోగం వదిలేసి స్వదేశానికి భాస్కర్ వచ్చేశాడు.