NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!
    రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!

    PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    07:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట ఒక బలమైన చర్య చేపట్టింది.

    బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన తీవ్ర దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం.

    ఈ దాడులు గురువారం కూడా కొనసాగినట్టు తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో, గురువారం పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఓ డ్రోన్ కుప్పకూలింది.

    అది సమీపంలోని ఓ రెస్టారెంట్ భవనంపై పడడంతో అక్కడ ఉన్న పలువురు గాయపడ్డారు.

    ఈ ఘటన పీఎస్ఎల్ 2025 మ్యాచ్‌ ప్రారంభానికి కొద్దిసేపటికి జరగడం పీసీబీకి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) తీవ్ర ఆందోళన కలిగించింది.

    వివరాలు 

    షావర్ జల్మీ-కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌ రద్దు 

    పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌) 2025లో భాగంగా జరిగే మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే రావల్పిండి స్టేడియం సమీపంలో ఈ డ్రోన్ కూలిన ఘటన సంభవించింది.

    పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌కు ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    భారత్‌ దాడులతో ఇప్పటికే కలవరపడుతున్న పీసీబీ, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తక్షణమే పీఎస్‌ఎల్‌ 2025 మ్యాచ్‌లను కరాచీకి మళ్లించింది.

    రాత్రి 8 గంటలకు రావల్పిండిలో జరగాల్సిన పెషావర్ జల్మీ-కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌ రద్దైంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని భద్రతా పరిస్థితులపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

    వివరాలు 

    ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం 

    ఇక పీఎస్‌ఎల్‌ 2025లో పాల్గొంటున్న ఇంగ్లండ్ క్రికెటర్ల భవితవ్యంపై కూడా అనిశ్చితి నెలకొంది.

    ఈ లీగ్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు మిగతా మ్యాచ్‌ల్లో కొనసాగాలా లేక వెంటనే పాక్ విడిచిపెట్టాలా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.

    ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అత్యవసర భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది.

    భారత్ దాడుల ప్రభావంతో ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లలో భయం నెలకొందని సమాచారం. వారు పీఎస్‌ఎల్‌ 2025 నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్

    Indian drone hits the building of Rawalpindi Cricket Stadium.

    Now All PSL games shifted from Rawalpindi to Narendra Modi stadium..💀#IndiaPakistanWar #PSLX pic.twitter.com/JoG71oyWfY

    — Abdullah Zafar (@Arain_417) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ! పాకిస్థాన్
    ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు  బీసీసీఐ
    Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్  రాజ్‌నాథ్ సింగ్

    పాకిస్థాన్

    India-Pakistan:మరో 24-36 గంటల్లో భారత్‌ సైనిక చర్యకు ప్రణాళిక.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు  అంతర్జాతీయం
    Indo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !! భారతదేశం
    Pak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు అంతర్జాతీయం
    India-Pakistan: హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోని పాకిస్థాన్.. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపు చర్యలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025