Page Loader
మూడో ర్యాంక్‌కు ఎగబాకిన హాకీ టీమిండియా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుపుతో ర్యాంకింగ్స్‌లో జోరు
ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుపుతో ర్యాంకింగ్స్‌లో జోరు

మూడో ర్యాంక్‌కు ఎగబాకిన హాకీ టీమిండియా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుపుతో ర్యాంకింగ్స్‌లో జోరు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

మరోసారి ఏషియన్ హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జగజ్జేతగా అవతరించిన టీమిండియా హాకీ, ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్తోంది. ఈ మేరకు భారత్ మూడో ర్యాంకుకు ఎగబాకినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(FIH) ఆదివారం ర్యాంకింగ్స్ లిస్ట్ విడుదల చేసింది. 2,771 పాయింట్లతో భారత జట్టు మూడో ర్యాంక్‌ కైవసం చేసుకుంది. నెదర్లాండ్స్‌ (3095 పాయింట్లు), బెల్జియం (2917 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గాక భారత్‌ మూడో ర్యాంక్‌కు చేరింది.చాలా రోజులకు మరోసారి మూడో స్థానంలో నిలిచింది. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో 4-3 తేడాతో మలేషియాను చిత్తుచేయడం తెలిసిందే. భారత్ విజేతగా నిలవడంపై కీలక ఆటగాడు మణిదీప్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. జట్టులో భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జట్టులో భాగమైనందుకు గర్విస్తున్నా: మణిదీప్ సింగ్