LOADING...
IND Vs PAK : భారత్, పాక్ మధ్య నేడు కీలక పోరు
భారత్, పాక్ మధ్య నేడు కీలక పోరు

IND Vs PAK : భారత్, పాక్ మధ్య నేడు కీలక పోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2023
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏషియన్ హకీ చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థుల పోరుకు నేడు రంగం సిద్ధమైంది. బుధవారం భారత్, పాకిస్థాన్ ముఖాముఖి తలపడనున్నాయి. చైన్నై వేదికగా జరిగే ఈ ఏషియన్ హాకీ చాంపియన్ ట్రోఫీలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీలో ఓటమన్నదే ఎరగకుండా ఓ వైపు భారత్ ముందుకెళ్తుతోంది. ఈ తరుణంలో భారత్ ను పాక్ ఏ విధంగా కట్టడి చేస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే సెమీస్ బెర్తును దక్కించుకున్న టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచులో పాక్ చిత్తును చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు పాక్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఈ రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.

Details

పది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్

భారత్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ మూడు విజయాలు, ఒక డ్రాను నమోదు చేసింది. దీంతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతుంది. పాకిస్థాన్ ఐదు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచులో పాక్‌ను చిత్తు చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. టీమిండియాపై విజయం సాధిస్తేనే పాక్ టోర్నీలో నిలిచే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచును తిలకించడానికి హాకీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.