
IOA: 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహణకు బిడ్‌ను ఆమోదించిన భారత ఒలింపిక్ సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
2030 కామన్వెల్త్ గేమ్స్‌ను స్వదేశంలో ఆతిథ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత ఒలింపిక్ సంఘం (IOA) బుధవారం తన బిడ్‌ను ఆమోదించనుంది. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్న భారత్, 2036 ఒలింపిక్స్ నిర్వహణకూ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో, విశ్వక్రీడలకు ముందు కామన్వెల్త్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించి దేశ ప్రతిభను ప్రపంచానికి చాటాలనే ఉద్దేశం ఉంది. భారత్ ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (CGF)కు ఆతిథ్యం ఇవ్వాలనే తన ఆసక్తిని తెలిపింది. అహ్మదాబాద్‌ను వేదికగా నిర్ణయించినట్లు పేర్కొంది. బిడ్‌ల సమర్పణకు ఈ నెల 31 తుది గడువు కాగా, అంతకుముందే తుది బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
Details
ఆతిథ్య రేసు నుంచి తప్పుకున్న కెనడా
ఈ నేపథ్యంలో నేడు జరగనున్న ఐఓఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో ఇతర అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఆతిథ్య రేసు నుంచి కెనడా తప్పుకోవడంతో భారత్‌కే హక్కులు దక్కే అవకాశాలు బలపడ్డాయి. కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల మూడు రోజుల పాటు అహ్మదాబాద్‌లో పర్యటించి వేదికలను పరిశీలించింది. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా చర్చలు జరిపింది. ఈ నెలాఖరులో CGFకు చెందిన మరో ప్రతినిధి బృందం భారత్‌ను సందర్శించనుంది.
Details
నవంబర్ లో తుది నిర్ణయం
ఆతిథ్య హక్కులపై తుది నిర్ణయం ఈ ఏడాది నవంబర్‌లో వెలువడే అవకాశముంది. "కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు పలు అంశాలపై ఆధారపడతాయి. క్రీడా సదుపాయాలు, ప్రభుత్వ మద్దతు, నిర్ణయాల్లో స్థిరత్వం, ఆకర్షణ వంటి అంశాలు కీలకం. 2030 ఆతిథ్య హక్కులు భారత్‌కే దక్కుతాయనే నమ్మకం ఉందని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు హర్‌పాల్ సింగ్ అన్నారు.