
ICC: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆటగాళ్ల హవా.. అభిషేక్ శర్మ సంచలన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజా విడుదల చేసిన టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యువ స్టార్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానం మరింత పదిలం చేసుకున్నాడు. అయితే ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా స్థానాన్ని పాకిస్తాన్ ఆటగాడు సైమ్ అయూబ్ భర్తీ చేశాడు. తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ 931 రేటింగ్ పాయింట్లతో ICC ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు. ఇది దాదాపు ఐదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును అధిగమించింది.
Details
మూడో స్థానంలో తిలక్ వర్మ
2020లో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ సాధించిన 919 పాయింట్ల రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. అంతేకాక సూర్యకుమార్ యాదవ్ (912), విరాట్ కోహ్లీ (909) వంటి సీనియర్ ఆటగాళ్ల రికార్డులను కూడా అతను అధిగమించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అభిషేక్ ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌లలో 314 పరుగులు చేసి 200కు పైగా స్ట్రైక్ రేట్ సాధించి టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్‌తో పోలిస్తే అభిషేక్ 82 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత భారత్ ఆటగాడు తిలక్ వర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Details
ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకున్న భారత ఆటగాళ్లు
శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఐదో స్థానానికి చేరగా, కుశల్ పెరేరా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సంజు శాంసన్ వంటి ఇతర ఆటగాళ్లు కూడా తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. భారత్ యువ టాలెంట్స్ ర్యాంకింగ్స్‌లో గొప్ప ప్రదర్శనతో ముందుండి రికార్డులు సృష్టించేస్తున్నాయి.