LOADING...
SRH vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 స్టార్ట్‌.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులో గెలుపెవరిది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 స్టార్ట్‌.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులో గెలుపెవరిది?

SRH vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 స్టార్ట్‌.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులో గెలుపెవరిది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 నేటి నుంచే (మార్చి 28) అట్టహాసంగా ప్రారంభం కానుంది. అసలైన టీ20 క్రికెట్ మజాను అందించేందుకు 10 జట్లు సిద్దమై రంగంలోకి దిగుతున్నాయి. వచ్చే రెండు నెలల పాటు సిక్సర్లు, ఫోర్ల వర్షంతో అభిమానులకు వినోదాన్ని పంచేందుకు ఈ సీజన్ సిద్ధమైంది. పాత పగలు, కొత్త సవాళ్లతో ఐపీఎల్ 19వ ఎడిషన్ మరింత రసవత్తరంగా సాగనుంది. గత సీజన్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన టైటిల్‌ను కాపాడుకోవడానికి బరిలోకి దిగుతుండగా, మిగతా 9 జట్లు ట్రోఫీ కోసం గట్టిగా పోటీ పడుతున్నాయి. నేడు తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

వివరాలు

ఆర్సీబీ బలాలు, బలహీనతలు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ రజత్ పాటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసకర బ్యాటర్లతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. కోహ్లీ ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో 9000 పరుగుల మైలురాయిని చేరే అవకాశముంది. అయితే బౌలింగ్ విభాగం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో దూరమవ్వగా, స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. చిన్నస్వామి వంటి హై-స్కోరింగ్ పిచ్‌పై బౌలర్లు ఎలా రాణిస్తారో ఆసక్తికరంగా మారింది.

వివరాలు

ఎస్ఆర్‌హెచ్‌కు కొత్త సవాల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకూ కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా దూరమవ్వడంతో, జట్టు నాయకత్వ బాధ్యతలను ఇషాన్ కిషన్కు అప్పగించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ బ్యాటర్లతో బ్యాటింగ్ బలంగా ఉన్నా, కమిన్స్ లేని లోటు బౌలింగ్‌లో కనిపించనుంది.

Advertisement

వివరాలు

తుది జట్లు (అంచనా)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (WK), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ జాకబ్ డఫీ, రసిక్ సలామ్ దార్. ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్ / సుయాష్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/WK), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్ జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ. ఇంపాక్ట్ ప్లేయర్: శివమ్ మావి / హర్ష్ దూబే.

Advertisement

వివరాలు

మ్యాచ్ ఎక్కడ చూడాలి?

ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో వీక్షించవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఏమవుతుందో? బ్యాటర్లకు అనుకూలమైన చిన్నస్వామి పిచ్‌పై ఇరు జట్ల మధ్య పరుగుల వర్షం కురవడం ఖాయం. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పాటు 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారే అవకాశముంది.

Advertisement