LOADING...
Paris Olympics : ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత షూటర్ రమితా జిందాల్
ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత షూటర్ రమితా జిందాల్

Paris Olympics : ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత షూటర్ రమితా జిందాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2024
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత షూటర్ రమితా జిందాల్ పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇవాళ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్ ఈవెంట్ అద్భుతంగా రాణించింది. ఈ క్వాలిఫైయర్స్‌లో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్ లో మాత్రం ఆమె నిరాశపరిచింది. తాజాగా క్వాలిఫైయర్స్ తో జిందాల్ 631.5 పాయింట్ల స్కోరు చేసి ఐదో స్థానంలో నిలవడం విశేషం.

Details

రెండో మహిళగా రమితా జిందాల్ రికార్డు

ఇదిలా ఉండగా మరో భారత్ షూటర్ ఎలావెనిల్ వేలారివన్ ఫైనల్‌కు రాలేకపోయారు. ఆఖరి షాట్స్‌లో తడబడి ఫైనల్ అవకాశాలను వదులుకుంది. మనుభాకర్ తర్వాత గత 20 ఏళ్లలో ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న రెండోవ మహిళా షూటర్ గా రమిత రికార్డు సృష్టించింది. రమిత తన కోచ్ సుమా షిరూర్ (ఏథెన్స్ 2004) తర్వాత ఒలింపిక్ ఫైనల్‌కు చేరుకున్న తొలి మహిళా షూటర్‌గా నిలిచింది.