Singapore Open Badminton: విజయంతో సింధుకు శుభారంభం..సింగపూర్ ఓపెన్‌లో సత్తా
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆమె 21-17, 21-18 తేడాతో పుత్రి కుసుమవర్ధనిపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో సింధు ఆరంభంలోనే 4-0 ఆధిక్యం సాధించినప్పటికీ, కుసుమవర్ధని తిరిగి పుంజుకుని స్కోరును 7-7తో సమం చేసింది. ఆ తర్వాత సింధు తన ఆటను మరింత దూకుడుగా మార్చి 15-11తో ముందంజలో నిలిచింది. అదే జోరును కొనసాగిస్తూ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.
వివరాలు
హోరాహోరీగా సాగిన పోరు..
రెండో గేమ్‌లో కూడా ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. కీలక సమయంలో వరుస పాయింట్లు సాధించిన సింధు 13-11తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట కూడా తొలి రౌండ్‌లో విజయాన్ని అందుకుంది. భారత జంట 26-28, 21-15, 21-13 స్కోరుతో మలేసియా జంట చెన్ జి యీ-ప్రెస్లీ స్మిత్‌పై గెలిచింది. తొలి గేమ్‌లో మాత్రమే ప్రత్యర్థి జంట నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనా, అనంతరం భారత ద్వయంవరుసగా రెండు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక లక్ష్యసేన్, ప్రణయ్, మాళవిక బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నారు.