భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణయ్ అవుట్
స్విస్ ఓపెన్‌లో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, పీవీ సింధు నిష్క్రమించారు. గురువారం జరిగిన పురుషల సింగల్స్ లో ఐదో సీడ్ ప్రణయ్, సీడెడ్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. 8-21, 8-21తో ప్రణయ్ పరాజయం పాలయ్యారు. శ్రీకాంత్ 20-22, 17-21తో లి చెక్ యు (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో శ్రీకాంత్ గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రెండో గేమ్‌లో తప్పిదాల కారణంగా మ్యాచ్‌ను శ్రీకాంత్ చేజార్చుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోవడం గమనార్హం. మూడు గేమ్‌ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు 15-21, 21-12, 18-21తో వర్దని (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది.
ముగిసిన భారత పోరాటం
మంజునాథ్ 19-21, 10-21తో చి హోయ్ లి (చైనీత్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యారు. శ్రీకాంత్, ప్రణయ్, మంజునాథ్ ఓటమితో పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. అంతకుముందు తొలి రౌండ్లో సింధు 21-9, 21-16తో జెజీర స్టాడెల్‌మన్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆకర్షి కశ్యప్ 15-21, 17-21తో యోనె లీ (జర్మనీ) చేతిలో ఓడింది. అయితే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజు, చిరాగ్ జోడీ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది